KTR: ఈ కేసులో ఏసీబీకి కేసు పెట్టే అర్హత లేదు..! 2 d ago
సీఎంకు సమాచారం లోపం ఉందని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సీఎంను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. నాపై కేసు నిలవదని చెప్పారు. మేం లీగల్‌గా ముందుకు వెళ్తామన్నారు. లంచ్ మోషన్ పిటిషన్ వేశామని చెప్పారు. పొన్నం అవినీతి జరగలేదంటున్నారు.. ఇంకా ఏసీబీ కేసు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. మంత్రిగా నేను ఫార్ములా ఈ-రేస్ విషయంలో.. విధాన నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. డబ్బులు పంపిన విధానం తప్పు అని పొన్నం అంటున్నారన్నారు. ఈ కేసులో ఏసీబీకి కేసు పెట్టే అర్హత లేదన్నారు.
ఈ కేసులో అరపైసా అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. సభలో ప్రభుత్వం తప్పులను.. హరీష్ బయటపెట్టినందుకు సిట్ వేశారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ కింద పనిచేసే సిట్‌తో న్యాయం జరగదని విమర్శించారు. ఓఆర్ఆర్ టెండర్లపై, కోకాపేట భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు. నన్ను ఏ కేసులో జైలుకు పంపాలో.. ప్రభుత్వానికి అర్థం కావడంలేదని కేటీఆర్ పేర్కొన్నారు.